Tips & Tricks, Tutorials, Hacking, Troubleshooting,



మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా అకస్మాత్తుగా Generic Host Process for Win32 Services has encountered a problem and needs to close.. అనే మెసేజ్ వచ్చి నెట్ బ్రౌజింగ్ నిలిచిపోవడంతో పాటు కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసి రీకనెక్ట్ చెయ్యడానికి ప్రయత్నించినా నెట్ రాకుండా నిలిచిపోతున్నట్లయితే ఈ క్రింద చెప్పబోయే పద్ధతిని అనుసరించండి. సమస్య పరిష్కృతం అవుతుంది.

మొదటి పరిష్కారం:

  1. Start>Run కమాండ్ బాక్స్ లో regedit అని టైప్ చేసి Registry Editor అనే ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయండి.
  2. అందులో ఎడమచేతి వైపు HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\Services\Browser\Parameters అనే విభాగంలోకి వెళ్లి కుడిచేతి వైపున IsDomainMaster అని కన్పించే string ఎంట్రీని డబుల్ క్లిక్ చేసి FALSE అని సెట్ చేసి OK కొట్టి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి.
  3. ఇప్పుడు మీ కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తే ఇప్పటివరకూ మీరు ఎదుర్కొన్న సమస్య తొలగిపోతుంది.

రెండవ పరిష్కారం:

పై తతంగం చెయ్యడం మీకు సులభంగా అన్పించకపోతే నెట్ బాగా పనిచేస్తున్న వేరే కంప్యూటర్ ద్వారా ఈ క్రింది లింకులోని ఒక ప్యాచ్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో రన్ చేయండి. సమస్య సాల్వ్ అవుతుంది.

డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.


Source: Computerera

No comments:

Post a Comment