మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా అకస్మాత్తుగా Generic Host Process for Win32 Services has encountered a problem and needs to close.. అనే మెసేజ్ వచ్చి నెట్ బ్రౌజింగ్ నిలిచిపోవడంతో పాటు కంప్యూటర్ ని రీస్టార్ట్ చేసి రీకనెక్ట్ చెయ్యడానికి ప్రయత్నించినా నెట్ రాకుండా నిలిచిపోతున్నట్లయితే ఈ క్రింద చెప్పబోయే పద్ధతిని అనుసరించండి. సమస్య పరిష్కృతం అవుతుంది.
మొదటి పరిష్కారం:
- Start>Run కమాండ్ బాక్స్ లో regedit అని టైప్ చేసి Registry Editor అనే ప్రోగ్రామ్ ని ఓపెన్ చేయండి.
- అందులో ఎడమచేతి వైపు HKEY_LOCAL_MACHINE\System\CurrentControlSet\Services\Browser\Parameters అనే విభాగంలోకి వెళ్లి కుడిచేతి వైపున IsDomainMaster అని కన్పించే string ఎంట్రీని డబుల్ క్లిక్ చేసి FALSE అని సెట్ చేసి OK కొట్టి రిజిస్ట్రీ ఎడిటర్ ప్రోగ్రామ్ క్లోజ్ చేయండి.
- ఇప్పుడు మీ కంప్యూటర్ రీస్టార్ట్ చేస్తే ఇప్పటివరకూ మీరు ఎదుర్కొన్న సమస్య తొలగిపోతుంది.
రెండవ పరిష్కారం:
పై తతంగం చెయ్యడం మీకు సులభంగా అన్పించకపోతే నెట్ బాగా పనిచేస్తున్న వేరే కంప్యూటర్ ద్వారా ఈ క్రింది లింకులోని ఒక ప్యాచ్ ని డౌన్ లోడ్ చేసుకుని మీ కంప్యూటర్లో రన్ చేయండి. సమస్య సాల్వ్ అవుతుంది.
డౌన్ లోడ్ లింకు: ఇక్కడ క్లిక్ చేయండి.
Source: Computerera
No comments:
Post a Comment